యంగ్ హీరో ఆకాష్ పూరి హీరోగా పరిచయమైన తొలి సినిమా ‘మెహబూబా’ తో నే విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు. ప్రస్తుతం ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం “రొమాంటిక్”. అనిల్ పాదూరి దర్శకుడు. “ఇస్మార్ట్ శంకర్” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్, హీరోయిన్ కేతికా శర్మను కౌగిలించుకున్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు. మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ముందుగా ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని తీసుకున్నారు. ఇటీవల సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఉత్తరాది నటి మందిరా బేడీని రొమాంటిక్ సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేశారు. 47 ఏళ్ల వయసులోనే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో ఆకట్టుకునే ఈ భామ రొమాంటిక్ సినిమా కోసం కొద్ది రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే మందిర ఆ పాత్రకు పూరి అనుకున్న స్థాయిలో న్యాయం చేయలేకపోవటంతో ఆమెను తొలగించినట్టుగా తెలుస్తోంది. మందిర బేడిని అనుకున్న పాత్రలోనే తరువాత రమ్యకృష్ణ నటిస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు మందిర కన్నా రమ్యకృష్ణ అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
previous post
next post