telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌నగర్ : .. మధ్యాహ్నానికే .. ఉప ఎన్నిక ఫలితాల అవకాశం..

tsrtc protest turns huzurnagar to bjps

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో ఈవీఎంలను లెక్కించనున్నారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనుండగా, ఇందుకోసం 14 టేబుళ్లు ఏర్పాట్లు చేశారు. పది గంటలకు గెలుపుపై ఓ అంచనా రానుండగా, మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తి ఏర్పాట్లు చేశారు. హుజూర్‌నగర్ కాంగ్రెస్‌కు కంచుకోట. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఇక్కడ గెలుపుపై కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఉత్తమ్‌కుమార్ భార్య పద్మావతి ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ తమదే గెలుపని టీఆర్ఎస్ చెబుతోంది. మరోవైపు టీడీపీ, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. హుజూర్‌నగర్ ఫలితం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సర్వత్ర ఉత్కంఠగా మారింది.

Related posts