బస్సుల్లో సీటుకోసం కొట్టుకుంటేనే అదోవిచిత్రం, ఇక విమానంలో కూడా సీటుకోసం కొట్టుకుంటే ఎలాఉంటుందో.. ఊహించాల్సిన పనేలేదు. తాజాగా, థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ నుంచి చైనాలోని నాన్ జింగ్ వెళ్లే విమానంలో కొందరు చైనీయులు కూడా ఎక్కారు. వారిలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. అయితే వారిద్దరికీ ఒకే చోట కాకుండా వేర్వేరుగా సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. తన ప్రియుడి పక్క సీటు తనకు కేటాయించాలంటూ చైనా యువతి పట్టుబట్టింది. కుదరదని సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా నూడిల్స్ తయారు చేసేందుకు ఉద్దేశించిన వేడి నీటిని తీసుకువచ్చి ఎయిర్ హోస్టెస్ ముఖాన కొట్టింది.
ఆమె ప్రియుడు కూడా ఎయిర్ ఏషియా సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. విమానాన్ని పేల్చేస్తామంటూ రంకెలేశాడు. వారిద్దరికీ సర్దిచెప్పేసరికి సిబ్బందికి తల ప్రాణం తోకకు వచ్చినట్టయింది. విమానం నాన్ జింగ్ సిటీ చేరుకున్న తర్వాత వారిద్దరిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటన జరిగి చాన్నాళ్లు కాగా, తన విధి నిర్వహణలో చూసిన అత్యంత విచారించదగ్గ అంశం ఇదేనంటూ నురాలియా మజ్లాన్ అనే ఎయిర్ ఏషియా ఉద్యోగిని సోషల్ మీడియాలో వివరించింది. ప్రముఖ ప్రశ్నోత్తరాల వెబ్ సైట్ ‘కోరా’లో అడిగిన ఓ ప్రశ్నకు నురాలియా ఈ సంఘటనను అందరితో పంచుకుంది.
టీడీపీని స్టోర్ రూమ్ లో పెట్టడం ఎవరి వల్లా కాదు: దేవినేని