ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆర్టీసీ కార్మికులు సోమవారం కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ర్యాలీకి షబ్బీర్ అలీ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి షబ్బీర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హఠావో.. ఆర్టీసీ బచావో అని నినదించారు. ఆర్టీసీలో ఒక్క కార్మికుడిని డిస్మిస్ చేసినా ప్రజలే కేసీఆర్‌ను డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా టీఆర్‌ఎస్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
సీఎం పదవి కోసం జగన్ రూ.1500 కోట్ల ఆఫర్: మాజీ సీఎం ఫరూక్