telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రజల తీర్పును అపహాస్యం చేసింది.. శివసేనపై ఫడ్నవీస్ ఫైర్

Fadnavis cm maharashtra

బలపరీక్షకు ఒక రోజు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శివసేనపై నిప్పులు చెరిగారు. బీజేపీ-శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రజల తీర్పును శివసేన అపహాస్యంపాలు చేసిందని మండిపడ్డారు. అన్ని స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.

ఏమాత్రం అవకాశం లేని అంశంపై శివసేన పట్టుబట్టిందని ఫడ్నవీస్ మండిపడ్డారు. సీఎం కావాలనే యోచనతో ఇతర పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందు శివసేన హిందూత్వం మోకరిల్లిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ తమకు లేదని ఫడ్నవీస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

Related posts