ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆయన ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే అలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం, విధ్వంసం, ప్రజల్ని దోచుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలేనని పేర్కొన్నారు.
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిపై జోకులు వేయడంఆ వ్యాధి లక్షణాలే అని వ్యాఖ్యానించారు. మరోపక్క డెంగ్యూతో రాష్ట్రంలో ప్రజలు చనిపోతుంటే సంబరాలు చేసుకోవడం వంటి అవలక్షణాలన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధి యొక్క లక్షణాలేనని బుద్ధా వెంకన్న తెలిపారు.
మండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులే: రోజా