telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అడ్డంగా కెమెరా కంటికి దొరికిపోయిన ఫీల్డ్ అంపైర్ జార్జ్ డేవిడ్‌సన్… వీడియో వైరల్

Big

మెల్‌బోర్న్ స్టేడియం వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. ఛేదనకి దిగిన మెల్‌బోర్న్ టీమ్ ఆఖరికి 137/8తో సరిపెట్టి.. 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన అడిలైడ్ స్ట్రైకర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 2 వికెట్లు పడగొట్టి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మెల్‌బోర్న్ టీమ్ బ్యాట్స్‌మెన్ వెబ్‌స్టెర్ బంతిని అంచనా వేయలేకపోయాడు. దీంతో.. నేరుగా వెళ్లిన బంతి అతని ప్యాడ్స్‌ని తాకింది. వెంటనే ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం రషీద్ ఖాన్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ జార్జ్ డేవిడ్‌సన్ ఔటిచ్చేలా వేలెత్తాడు. కానీ.. ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ వేలితో ముక్కుపై దురుద వచ్చినట్లు గోక్కున్నాడు. దీంతో.. అప్పటి వరకూ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్న రషీద్ ఖాన్‌ అవాక్కయ్యాడు.

Related posts