telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ : … ఆర్టీసీ సమ్మె .. తాత్కాలిక ఉద్యోగాల ప్రకటన.. త్వరపడాలి ..

Tsrtc increase salaries double duty employees

ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 05.10.2019 రోజు నుండి జరుగు సమ్మె కాలంలో తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు మరియు కండక్టర్లుగా పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల కోసం ప్రకటన వేశారు. నిజామాబాద్ రీజియన్ లో శుక్రవారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11.00 గంట వరకు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రీజినల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయము, నాగారం, నిజామాబాద్ కు రాగలరని ప్రకటన విడుదల చేశారు. కండక్టర్ గా పనిచేయుటకు ఆదార్ కార్డు మరియు ఒరిజినల్ పదవ తరగతి మార్కుల పత్రము / అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వారు, వారి మార్కుల ధృవ పత్రము తీసుకురావాలి.

డ్రైవర్ గా పనిచేయుటకు ఆధార్ కార్డు మరియు 18 నెలలు, అంతకంటే ఎక్కువ హెవీట్రాన్స్ పోర్ట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న వారు ఒరిజినల్ లైసెన్స్ తో హాజరు కాగలరని తెలిపారు. వీరికి రోజువారీగా డ్రైవర్ లకు 1500.00 రూ. లు.. కండక్టర్ లకు 1000.00 రూ. లు చెల్లిస్తారు. రిటైర్డ్ అయిన (T.S.R.T.C) అభ్యర్థులు సమ్మె కాలంలో పని చేయడానికి ఆసక్తి గలవారు తమ పరిధిలో గల డిపో మేనేజర్ లను లేక రీజినల్ మేనేజర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. రిటైర్డ్ సూపర్ వైజర్ లకు 1500,000 రూ. లు…రిటైర్డ్ మెకానిక్ లకు : 1000.00 రూ. లు.. రిటైర్డ్ క్లర్క్ లకు 1000.00 రూ. లు చెల్లిస్తామని అధికారులు ప్రకటనలో తెలిపారు.

Related posts