telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్యాక్స్ కట్టే వాళ్లకు వేధింపులు లేకుండా చేశాం: మోదీ

modi on jammu and kashmir rule

ట్యాక్స్ కట్టే వాళ్లకు అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేశామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలే కేంద్రంగా ఉండేలా విధానాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ట్యాక్స్ లకు సంబంధించి డిపార్ట్ మెంట్లను పునర్వ్యవస్థీకరించామని, అవినీతికి చోటు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఢిల్లీలో జరిగిన టైమ్స్ నవ్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. దేశంలో 130 కోట్ల మందికిపైగా జనాభా ఉంటే అందులో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్ను కడుతున్నారని. ప్రజలంతా నిజాయతీగా పన్నులు కడతామని వాగ్దానం చేయాలని సూచించారు. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు.

Related posts