తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.7 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 721 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,261 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,66,120 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్త్రంలో మొత్తం 1480 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 94.06 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 96.67 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, ప్రస్తుతం 7,696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 51,402 పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 59,19,635 కు చేరుకుంది.
previous post
next post
రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్కు లేదు: సీపీఐ నారాయణ