రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీపీఎస్ లో కాంట్రాక్టు ఉద్యోగులు అందుకున్న తొమ్మిది నెలల జీతాలపై వైసీపీ ప్రభుత్వం రికవరీ అస్త్రాన్ని ప్రయోగించింది. కేంద్ర నిధులను వేతనాలు పెంచేందుకు ఎలా వాడతారని ప్రశ్నిస్తూ.. ఇప్పటివరకు తీసుకున్న పెరిగిన మొత్తాలను తిరిగి చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులను ఆదేశించింది. వైసీపీ వైఖరిని టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సందిస్తూ..‘ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా రివర్స్ టెండరింగా? సిగ్గుగా లేదా? టీడీపీ హయాంలో మహిళా,శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.7వేల వరకు జీతాలు పెంచారు. ఇప్పుడు పెంచిన జీతాన్ని వైసీపీ ప్రభుత్వం తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి అనడం దారుణమని పేర్కొన్నారు.
జగన్ పేరు జాతీయస్థాయిలో వినిపిస్తోంది: మంత్రి కన్నబాబు