telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏకంగా చెవిలో కాపురం పెట్టిన బొద్దింకలు… అసలేం జరిగిందంటే ?

Ear

అతడి పేరు ఎల్‌వీ. వయసు 25 ఏళ్ల అతను చైనాలో నివసిస్తుంటాడు. ఓ రోజు రాత్రి అతడు నిద్రిస్తుండగా భయంకరమైన చెవిపోటు వచ్చింది. నొప్పి మరింత పెరగడంతో ఎల్‌వీ వెంటనే ఆసుపత్రికి పరిగెత్తాడు. నొప్పి భరించలేకపోతున్నానంటూ డాక్టర్ వద్ద భోరుమన్నాడు. వెంటనే అతడి చెవిని పరీక్షించిన డాక్టర్ ఒక్కసారిగా షాకయ్యారు. ఎల్వీ చెవిలో బొద్దింకలు ఏకంగా గూడునే పెట్టుకున్నాయి. బొద్దింకలను చూసిన డాక్టర్‌కు నోటమాట రాలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది పిల్ల బొద్దింకలు ఎల్‌వీ చెవిలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. చెవి మొత్తం పచార్లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. వాటి అల్లరితో ఎల్‌వీ చాలానే ఇబ్బంది పడ్డాడు. అవి చెవి లోపల తిరుగుతుంటే నొప్పి భరించలేక ఎల్‌వీ గిలగిలలాడిపోయాడు. అయితే డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఎల్‌వీ చెవిలోని పిల్ల బొద్దింకలను తొలగించి ఆయింట్‌మెంట్ రాసి ఇంటికి పంపించారు. ఎలా జరిగిందో తెలీదు కాని అతడి చెవిలో బొద్దింక గుడ్లు పెట్టిందని.. వాటిలోంచి బయటకొచ్చిన పిల్ల బొద్దింకలు ఎల్‌వీతో ఇలా డ్యాన్స్ చేయించాయని డాక్టర్ తెలిపారు. ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.

Related posts