telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక సామాజిక

మెుబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మే 1 నుంచి ఫేక్ కాల్స్, SMS ల నుంచి విముక్తి

మెుబైల్ ఫోన్ల వినియోగం దేశంలో పెరిగిపోతూ వస్తోంది. అయితే వినియోగదారులను బాగా ఇబ్బంది పెడుతున్న విషయాల్లో ఒకటి అనవసరమైన కాల్స్, మేసెజ్‌లు.  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కాలింగ్ నిబంధనల్లో మార్పులను తీసుకొచ్చింది, ఇవి మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా దేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన టెక్నాలజీని ఇప్పటికే సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.

నకిలీ కాల్స్, ఎస్ఎమ్ఎస్ లను నిరోధించేందుకు ఎయిర్‌టెల్ ఏఐ ఫిల్టర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గతంలో తెలిపింది. దేశంలో అతిపెద్ద ఆపరేటర్ గా ఉన్న రిలయన్స్ జియో సైతం AI ఫిల్టర్‌లను సెటప్ చేసే ప్రణాళికతో ముందుకొస్తోంది. ఇదే సమయంలో బోగస్ కాల్స్ నిరోధించేందుకు చర్యల్లో భాగంగా టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్.. 10 అంకెల మెుబైల్ నంబర్లను ప్రమోషన్, బిజినెస్ అవసరాలకు వినియోగించకుండా బ్లాక్ చేయాలని కోరింది.

Related posts