telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఖమ్మంకు వైఎస్ షర్మిల… కారణం..?

గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల షర్మిల ఏం చేసిన అదో హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే… తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల.. ఆ తర్వాత రోజు.. ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. హైదరాబాద్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కీలక చర్చలు జరిగాయి. ఇక, తర్వాత సమావేశం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో జరగనుంది. ఈనెల 21న ఖమ్మం జిల్లాలో షర్మిల మీటింగ్ నిర్వహించనున్నారు.. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఖమ్మం వెళ్లనున్నారు వైఎస్ షర్మిల.. అక్కడ వెయ్యి మంది వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుందని తెలిపారు.. వైఎస్ షర్మిల ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి… వైఎస్ గతంలో గిరిజనులకు పోడు భూముల సమస్యలు లేకుండా పట్టాలు అందజేశారని.. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పోడు భూములు ప్రధాన సమస్యగా మారిందన్న ఆయన.. ఖమ్మం జిల్లాలో గిరిజనులతో కూడా షర్మిల సమావేశం ఉంటుందన్నారు కొండా రాఘవరెడ్డి. చూడాలి మరి ఈ మంతనాలు ఎక్కడివరకు వెళ్తాయి అనేది.

Related posts