telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ట్రాఫిక్ కానిస్టేబుల్ దారి ఇచ్చిన అంబులెన్స్ లోని వృద్ధుడు సురక్షితం…

గత వారం అబిడ్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి పరిగెడుతూ అంబులెన్స్ లో దారి ఇచ్చిన ఘటనలో ఓ వృద్ధుడు సురక్షితంగా ఉన్నాడు. హయత్ నగర్ కు చెందిన వ్యక్తికు గుండె , కిడ్నీ సంబంధిత సమస్యతో మాలక్ పెట్ యశోద హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకున్న సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో సకాలంలో హాస్పిటల్ కు చేరారు. కానిస్టేబుల్ పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు వృద్ధుడి కూతురు, అల్లుడు. చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో కానిస్టేబుల్ బాబ్జికి కృతజ్ఞతలు తెలిపాడు వృద్ధుడు. అయితే హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వైపు వెళుతున్న అంబులెన్స్ కు దారి క్లియర్ చేస్తూ డ్యూటీ బాధ్యతను చాటుకున్నాడు బాబ్జి. అబులెన్స్ కు దారి క్లియర్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ ను సేవ్ చేసాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దింతో ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

Related posts