ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలు, కరోనా పరిస్థితులపై ఈరోజు చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును గవర్నర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఉన్నది. అలానే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమౌతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఉన్నది. దీనిపై గవర్నర్ తో చర్చించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అసెంబ్లీలో ఆమోదించాల్సిన కీలక బిల్లుల విషయంపై కూడా ఈరోజు గవర్నర్ తో చర్చించబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా సీఎం జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
previous post