telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కౌంటింగ్‌ మొదలుపెట్టక ముందే సీఎం అయిపోయిన తేజస్వీ..!

బీహార్‌ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. ఈ ఎన్నికలు జేడీయూ, ఇటు ఆర్జేడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకోవడానికి నితీష్‌ కుమార్‌ ప్రయత్నం చేయగా.. ఎలాగైనా అధికారంలోకి రావాలని తేజస్వియాదవ్‌ ప్రజల్లోకి వెళ్లారు. ఇది ఇలా ఉండగా..ఎన్నికల కౌంటింగ్‌ జరుగకముందే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సీఎం అంటూ హోర్డింగులు వెలిశాయి. సోమవారం తేజస్వి పుట్టిన రోజు సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు “బీహార్‌ కాబోయే సీఎం” అని సంభోదిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. పాట్లాలోని పలు చోట్ల పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఇవాళ ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో తేజస్వి పేరు ప్రధానంగా వినిపించింది. ఈ రోజు తేజస్వి పుట్టిన రోజు మాత్రమే కాకుండా…రేపే బీహార్‌ అసెంబ్లీ ఫలితాలు రాబోతుండటం..పైగా సర్వేలు అన్నీ మహాకూటమికి అనుకూలంగా ఉండటంతో తేజస్వి పుట్టిన రోజుకు మరింత ఆదరణ లభించింది. కాగా.. బీహార ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్ని తేజస‌్వి యాదవ్ కు అనుకూలంగా వచ్చాయి.

Related posts