నేనెవరో ఎవరో
మీకు తెలీదు
కాని మీ మనసులో
కాసింత చోటు
మీ తలపుల్లో
కొన్ని క్షణాలైనా
గడుపుతున్నాను
మీ మౌనంలో
బాషలెన్నో
మీ కళ్ళలో
ఊసులెన్నో
చూసాను
స్పర్షలోని
ఆప్యాయతని
సవిచూసాను
అనురాగంలోని
అనుభూతిని
పొందాను
మీ లాలనలో
సేద తీరాను
మీ ప్రేమలో
కరిగిపోయాను
మీచూపులో
ఒదిగిపోయాను
మీతొ పాటు
పయనిస్తున్నాను
ఇది నా మరణం వరకు
సాగాలని ఆశిస్తున్నాను
కరుడు కట్టిన
కఠిన హృదయాలున్న
కలికాలంలో
మీకరుణకు నోచుకున్న
నన్ను తప్ప
ఎవరిని ఇస్టపడని నాకు
మీరంటే ప్రాణం
అనేలా చేసారు
కలలో కూడా ఊహించని
ఈ బంధం నాకు వరం
ఉన్నాడో లేడోతెలీని దేవున్ని
నమ్మాను ఇంతకాలం
కళ్ళముందున్న ఈ దేవున్ని
పూజిస్తాను కలకాలం …..
బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం: చంద్రబాబు