telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తమిళనాడులో జర్నలిస్టు దారుణ హత్య…

తమిళనాడులో జర్నలిస్టును దారుణంగా హత్య చేశారు దుండగులు… స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలు, తదితర అంశాలపై స్టింగ్ ఆపరేషన్‌లు చేసి వరుస కథనాలను అందించిన తమిళన్ టీవీ రిపోర్టర్ మోసెస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.. ఆయన శరీరంపై దాదాపు 18 గత్తి పోట్లను గుర్తించారు. జర్నలిస్టు మోసెస్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, గంజాయి స్మగ్లర్లే రిపోర్టర్ మోసెస్‌ను దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.. స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూకబ్జాలపై.. స్టింగ్ ఆపరేషన్ చేసి.. వారికి కంటిమీద కునుకులేకుండా చేశాడు.. దీంతో పగబట్టిన ఆ గ్యాంగ్.. కిరాతకంగా హత్య చేసినట్టు చెబుతున్నారు.. కాంచీపురంలోని పుండ్రత్తూర్‌లో ఉన్న సదరు రిపోర్టర్‌తో మాట్లాడేది ఉంది.. బయటకు రమ్మని పిలిచిన గ్యాంగ్.. ఆ తర్వాత దారుణంగా హత్య చేసింది. అయితే, ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. మరికొందరు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రిపోర్టర్‌ మోసెస్ వయస్సు 26 ఏళ్లు మాత్రమే.. యువ జర్నలిస్టుగా ఎన్నో సంచలనమైన కథనాలను అందించాడు.. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.. ఎవరో అతన్ని పిలిస్తే.. స్నేహితులే కావొచ్చని తండ్రి భావించాడు.. కానీ, ఈ దారుణం జరిగిపోయింది. మోసెస్ ఇంటికి సమీపంలోనే ఈ హత్య జరిగింది.. ఆ గ్యాంగ్ బారి నుంచి తప్పించుకునే  పారిపోయే ప్రయత్నం చేయగా.. కత్తులతో దాడి చేసి దారుణంగా పొడిచారు… అతని అరుపులు విని అతని తండ్రి, పొరుగువారు బయటకు వచ్చేసరికి కుప్పకూలిపోయాడు మోసెస్.. వెంటనే క్రోమ్‌పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

Related posts