ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ నూతన లోగోను ఆవిష్కరించింది. వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ తదితర పేరున్న యాప్స్ కు మాతృసంస్థగా ఉన్న ఫేస్ బుక్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ లోగోను విడుదల చేసింది. ఫేస్ బుక్ కు అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నుంచి ఫేస్ బుక్ మరింత స్పష్టతను కోరుకుంటోందని ఫేస్ బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో ఈ సందర్భంగా తెలిపారు.
యూజర్లకు కూడా సామాజిక మాధ్యమాలను గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో లోగోను మార్చినట్టు వెల్లడించారు. త్వరలోనేఫేస్ బుక్ కొత్త వెబ్ సైట్ ను కూడా అందుబాటులోకి తేనున్నామని ఆంటోనియో తెలిపారు. ప్రస్తుతం ఫేస్ బుక్ అధీనంలోనే ఫేస్ బుక్ యాప్, మెసింజర్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ యాప్, ఓకులస్, వర్క్ ప్లేస్, పోర్టల్, కాలిబ్రా వంటి అనుబంధ యాప్స్ ఉన్నాయి.
ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోంది: రాహుల్