telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈనెల 31 వరకు పంజాబ్‌ లాక్‌డౌన్‌!

punjob state lok down

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. వైరస్ ను అరికట్టేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. నిత్యావసరాలు, కూరగాయలు, మెడికల్‌ షాపులు తప్ప మిగిలినవన్నీ మూసివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు కూడా తిరగవు. ఇప్పటికే రాజస్థాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్నింటిని నిలిపివేశారు.

Related posts