telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో మళ్ళీ అంతుచిక్కని వ్యాధి కేసులు…

ఇప్పటికే మన దేశంలో కరోనా వైరస్ తో పాటుగా స్ట్రెయిన్ కేసులు కూడా భారీగా వస్తున్నాయి. అయితే ఏపీలో ఆ మధ్య ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనేక మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనేక మంది ఉన్నట్టుండి కళ్ళుతిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  నీటిలో రసాయనాలు కలవడమే దీనికి కారణమని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి సంఘటనే నాలుగు రోజుల క్రితం భీమడోలు మండలం పూళ్ళలో జరగగా ఈరోజు అలాంటిదే మరొకటి జరిగింది. దెందులూరు మండలంలోని కొమిరేపల్లి గ్రామంలో ప్రజలు కళ్ళుతిరిగి పడిపోతున్నారు.  గ్రామంలోని అనేకమంది ఇదే తరహాగా పడిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  అంతుచిక్కని వ్యాధిగా స్థానికులు అనుమానిస్తున్నారు.  వింత వ్యాధికి గురైన వ్యక్తులను హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు.  అయితే ఈ గ్రామానికి ఏపీ సీఎస్ ఆదిత్యనాద్ వెళ్లారు. అంతుచిక్కని ఈ వ్యాధి పై కారణాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 22 కేసులు వచ్చాయన్న ఆయన విచారణ చేసి సీఎంకు రిపోర్ట్ ఇస్తామని అన్నారు. వాటర్ లో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదని ఆయన ఇక మీదట ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts