telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్త జిల్లాల్లో బాధ్యతల స్వీకరణలో ఐఎఎస్, ఐపిఎస్ లు కోలాహలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నవశకం ఆవిష్కృతమైంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు .ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు

నేటి నుంచే 26 జిల్లాల్లో ప‌రిపాల‌న వికేంద్రిక‌ర‌ణ ద్వార‌ పాల‌న ఆరంభం కానుంది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుతో పాటు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ వంటి కీలక పోస్టుల్లో అధికారులను కూడా నియమించింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో అధికారులు పదవీస్వీకరణలో పాత, కొత్తజిల్లాల్లో కోలాహలం మొదలయ్యింది.

జిల్లా ఏర్పాటుపై చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. గిరిజనులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక టీమ్‌గా తామంత పనిచేస్తామని హాృదయపూర్వకంగా తెలిపారు.. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌.

చరిత్రలో ఒక భాగమైనందకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభుత్వ సూచనలతో జిల్లాను అభివృద్ధి చేస్తాం.. బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయ

తిరుపతి జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు. స‍్పెషాలిటీ ఉన్న జిల్లా తిరుపతి. ఇక్కడ సెక్స్‌ రేషియో 1:1 గా ఉంది. ఎకానమీ పరంగా తిరుపతి నుంచి మంచి రెవెన్యూ బూస్ట్‌ ఉంటుంది. జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొని ముందుకు వెళ‍్తాం.. తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

Related posts