telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ముగిసిన భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలు…

బోయినపల్లి కిడ్నాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్న సంగతి తెలిసిందే. అఖిలప్రియను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలు ముగిసాయి. భార్గవ్ రామ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు పోలీసులు. భార్గవ్ రామ్ ఈ కేసులో ఏ-3 గా ఉన్నాడని అతన్ని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ కేసులో మరికొంత మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. భార్గవ్ రామ్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని భార్గవ్ రామ్ తరపు న్యాయవాదులు వివరించారు. కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు భార్గవ్ రామ్ తరపు న్యాయవాదులు. అయితే ఇరు వాదనలు విన్న కోర్ట్.. ముందస్తు బెయిల్ పిటీషన్ పై సాయంత్రం తుది ఆదేశాలు జారీ చేయనుంది. చూడాలి మరి కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అనేది.

Related posts