telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘ఫోన్‌ ట్యాపింగ్’ పై‌ ఏపీ హైకోర్టులో విచారణ

ap high court

‘ఫోన్ ట్యాపింగ్‌’ ఆరోపణలపై ఏపీ ఈ హైకోర్టు రోజు విచారణ జరిపింది. రాష్ట్రంలో జడ్జీల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్‌హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది.

ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదో చెప్పాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

Related posts