telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జేపీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఫైర్

KCR cm telangana

లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి  జేపీ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జేపీకి తెలుసా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టును విమర్శిస్తున్న నేతలు ఎప్పుడైనా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఈర్శ్యతోనే జేపీ అలా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. రాజకీయ లబ్దికోసమే పలు పార్టీల నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లుపై రాద్ధాంతం చేస్తున్నారని నిప్పులుచెరిగారు. వారి విమర్శలను పట్టించుకునేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Related posts