ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మన రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని తెలంగాణ పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు అన్నారు. తననియోజక వర్గం పాలకుర్తిలోని కరోనా బాధితులకు భరోసా కల్పించారు. కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాబాధితులకు మనో ధైర్యం ఇవ్వడం కోసమే నేరుగా టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కరనో తీవ్రత కొంత తగ్గిందన్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనా ఏమీ చేయదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఎంపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, డాక్టర్లు పాల్గొన్నారు.