telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొల్లాపూర్‌లో ఉద్రిక్తత: తాను సంపాదించిన పేరు, ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమైన నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలోనే నేడు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను సంపాదించిన పేరు, ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంచి చేసి పేరు సంపాదించాలని.. కానీ చౌకబారు రాజకీయాలెందుకు అని ప్రశ్నించారు.

అంత‌కుముందు.. తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న… కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని చేయించుకున్నారు. అతని వర్గీయులకు మాత్రమే హర్షవర్దన్ రెడ్డి మేలు చేశారని విమర్శించారు.

తనది మచ్చలేని చరిత్ర కాబట్టే.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. తాను ఏ బ్యాంకు నుంచి తీసుకన్న రుణం కూడా ఎగగొట్టలేదని చెప్పారు. తాను అప్పులు చేసి వ్యాపారం చేశానని.. తప్పులు చేయలేదని తెలిపారు. హర్షవర్దన్‌పై చేసిన ఆరోపణలను రుజువు చేస్తానని చెప్పారు. తాను చేసిన సవాలకు 100 శాతం కట్టుబడి ఉన్నట్టుగా వెల్లడించారు.

కొల్లాపూర్‌లో టెన్షన్.. టెన్షన్..

ఇక, కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార టీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్ష‌వర్దన్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకొన్నాయి. అభివృద్దిపై తమ చర్చకు అనుమతి ఇవ్వాలని ఇరువర్గాలు పోలీసులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ ఇరువర్గాలు.. ఆదివారం చర్చకు సిద్దమవ్వడంతో.. కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

అయిన‌ప్ప‌టికీ జూపల్లితో బహిరంగ చర్చకు బయల్దేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పెంట్లవెల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు. అరెస్టు సమయంలో కార్యకర్తల నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. జూపల్లి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ఎమ్మెల్యే వర్గం ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

Related posts