రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో రేపు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందును నిర్వహిస్తోందని చెప్పారు. ఇందుకోసం వేదికను ఇంకా ఎంపిక చేయలేదన్నారు. వీలైనంత త్వరగా వేదిక ఎంపిక చేసి, ఏర్పాట్లను పూర్తిచేస్తామని శశిధర్ అన్నారు.
నిన్న హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పాల్గొన్నారు.