telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ దగుల్ బాజీ ముఖ్యమంత్రి…

వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. కేసీఆర్ మందుతాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. బీజేపీని చూస్తే కేసీఆర్ కు ఉచ్చపడుతోంది. వరంగల్ లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదు. హైదరాబాద్ వరద బాధితులకు పదివేలు ఇచ్చిన కేసీఆర్ వరంగల్ లో ఎందుకు ఇవ్వలేదు. కేసీఆర్ దగుల్ బాజీ ముఖ్యమంత్రి, బడాచోర్ ముఖ్యమంత్రి… హైదరాబాద్ లో జరిగినట్టే వరంగల్ లోనూ జరగబోతోంది. వరంగల్ లో బీజేపీ గెలవబోతోంది అని సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. అందుకే వరంగల్ లో ఎన్నికలు పెట్టడం లేదు. వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ టెంపుల్ లో ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా అని ప్రశ్నించారు బండి. వరంగల్ లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు 2బిహెచ్ కే .. టుబేటాబాపు హరీష్ రావు, కేటీఆర్ గా మారింది అన్నారు. గూగుల్ లో వేస్ట్ సీఎం ఆఫ్ ఇండియా అని కొడితే…. కేసీఆర్ అని వస్తోంది. బెస్ట్ పర్సన్ అంటే మోదీని చూపిస్తోంది అని తెలిపారు. చుడాలిమరి దీని పై ప్రత్యర్ధులు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts