telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నల్గొండ జిల్లాలో బీజేపీ నిరాహారదీక్ష…

నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల్ మండల సాధనకై బిజెపి నిరాహారదీక్ష. ముసాయిదాలో ప్రకటించిన గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి చేపట్టిన ఈ నిరాహార దీక్ష లో పాల్గొని దీక్ష ను విరమింపజేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆవిడ మాట్లాడుతూ… ముసాయిదాలో ప్రకటించిన మండలాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారో కేసీఆర్ అవగాహన లోపంగా అనుకోవాలా అంటూ ప్రశ్నించారు. శాస్త్రీయ పద్దతిలో పనులు చేయకుండా అడ్డగోలుగా తన అనుచరుల కోసం కొత్తగా మండలాలు జిల్లాలు ఏర్పాటు చేశారు. అవగాహన రాహిత్యంతోనే తెలంగాణలో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయన్నారు. జిల్లాల పునర్విభజనలు చేశాక కూడా 25 మండలాలు కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు మొదటి ముసాయిదాలో ప్రకటించిన గట్టుప్పల్ గ్రామాన్ని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన గట్టుప్పల్ మండలాన్ని వెంటనే ప్రకటించాలని లేకుంటే మాట తప్పే ముఖ్యమంత్రుల జాబితాలో తండ్రి కొడుకులు చేరుతారన్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల తో కేసీఆర్ దిమ్మతిరిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తండ్రి కొడుకులు మూర్చపోయారన్నారు. హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు రెండు చెంపలు వాయించారు.

రైతులకు సన్న రకం వరి వేయమని వాటిని కొనడానికి నిరాకరీంచాడు ఈ ముఖ్యమాంత్రికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బంద్ కు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో లబ్దిపొందడానికే జిమ్మిక్కులతో మోసాలతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాడని, ఆ ప్రజా ధనాన్ని బిజెపి ప్రభుత్వం కక్కిస్తుందనే ఢిల్లీ వెళ్లి దండాలు పెట్టోస్తున్నాడు. అక్రమంగా సంపాదించిన కెసిఆర్ ను త్వరలో జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని చూస్తున్న ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం బిజెపి చెప్తుందన్నారు. రైతులకు దొంగ ప్రేమలు ఒలగబోసిన ముఖ్యమంత్రి రైతుల ఋణమాఫీ ఎందుకు చేయడం లేదో జవాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కునే సత్తా బిజెపి కి ఉందన్నారు.

పుటకోమాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కు దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు కళ్ళు తెరిపించాయన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, ఇంటింకి ఉద్యోగమంటూ, డబుల్ బెడ్రూం అంటూ ప్రజలను మోసం చేస్తూ పాలిస్తున్నాడని విమర్శించారు. గ్రాడ్యుయేషన్ ఓట్లకోసమే మళ్ళీ ఉద్యోగాల మాట ఎత్తుతున్నాడని, మరోసారి నిరుద్యోగులు మోసపోరని అన్నారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆరెస్ మద్య ఒప్పందం కుదుర్చుకుని నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారు.తెలంగాణలో బిజెపి కి పునాది వేసింది దుబ్బాక ఎన్నికల ఫలితాలేనని అన్నారు.తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్య వ్యస్థలో ప్రతి పేదవాడి అభివృద్ధి జరగాలన్నా బీజేపీ కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో బండి సంజయ్ నేతృత్వంలో కేసీఆర్ కు ముళ్లబాట ప్రత్యేక తప్పదన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బిజెపి అధికారంలోకి రాగానే గట్టుపల్ మండలం ప్రకటిస్తామన్నారు.

Related posts