కరోనా కాలంలో కష్టాలకు చెక్.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్‌బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్‌బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ టూల్ అందుబాటులోకి తెస్తుంది ఎఫ్‌బీ.. ఈ టూల్‌ను భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించామని, మొత్తం దేశంలోని 17 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది. ఇది అందుబాటులోకి వస్తే.. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు తమ దగ్గరలోని వ్యాక్సిన్ సెంటర్లను ఈ టూల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ఆధారంగా వ్యాక్సినేషన్ సెంటర్ల లొకేషన్లతో పాటు అవి పని చేసే వేళలను ఈ ఫేస్‌బుక్ టూల్ వెతికి పెట్టనుంది. ఇక, ఈ టూల్‌లో కొవిన్ పోర్టల్ లింకు కూడా ఉంటుందని.. దీని ద్వారా నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
previous post