telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మారుతీ రావు ఆత్మహత్యపై కూతురు అమృత అనుమానాలు

amrutha maruthi rao

ప్రణయ్ హ్యత కేసులో నిందితుడు మారుతీ రావు ఆత్మహత్యపై కూతురు అమృత అనుమానం వ్యక్తం చేశారు.తన తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. తన భర్త ప్రణయ్ హ్యత కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే మారుతీరావు బలన్మరణానికి పాల్పడ్డాడని తేల్చడం సరికాదన్నారు. అలాగే, తన తల్లికి కూడా ప్రాణాపాయం ఉండొచ్చని అన్నారు.

మారుతీరావుకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయని అమృత చెప్పారు. ఆస్తుల విషయంలో బాబాయ్ శ్రవణ్‌కు, తన తండ్రికి మధ్య గొడవలు ఉన్నాయని తెలిపారు. తన తండ్రిని శ్రవణ్ కొన్నిసార్లు కొట్టినట్టు కూడా తనకు తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తన తల్లికి కూడా ప్రాణాపాయం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన బాబాయ్ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారని అమృత ఆరోపించారు.

Related posts