telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ లో 54.65 శాతం ఓటింగ్

elections voters

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. క్యూలైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 54.65 శాతం ఓటింగ్ నమోదైంది. గత 22 ఏళ్లలో ఢిల్లీలో ఇంత తక్కువ శాతం ఓటింగ్ నమోదవడం ఇదే ప్రథమం.

కాగా, 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య తీవ్రపోరు నెలకొనగా, కాంగ్రెస్ సైతం ఉత్సాహంగా బరిలో నిలిచింది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.

Related posts