ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ ట్వీట్ చేశారు. “టూరిస్టు బాబుగారు ఏపీలో 2 రోజులు ఉండేలా వస్తున్నారహో!పునాది వేసి సమాధిగా మార్చిన ప్రాంతాన్ని…రోడ్లూ డ్రెయినేజీ,నీరూ,కరెంటూ లేకుండా పంచానంటున్న రైతుల ప్లాట్లనూ చూపించి… కన్నీళ్ళు కార్చటానికి ఆయన, తమ భూముల రేట్లు తగ్గటానికి వీల్లేదని బినామీలూ పెట్టే గావు కేకలకు ఏడాది అవుతోందట! ” అంటూ ట్వీట్ చేశారు విజయ సాయిరెడ్డి.
“పోలవరం ప్రాజెక్టును కాల్వలు తవ్వి, అనుమతులన్నీ తెచ్చి డాక్టర్ వైయస్సార్ భుజాన మోస్తే… నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయారు. ఇంతకీ 1995 నుంచి 3 దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నాయన ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు అయినా ఉందా? ” అంటూ మరో ట్వీట్ చేశారు విజయ సాయిరెడ్డి.