telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ హెల్త్ బులిటెన్…

Rajinikanth actor

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర రక్తపోటుకు గురికావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రిలో చేరారు. రజనీ కాంత్ ఆరోగ్యం పై అపోలో ఆసుపత్రి తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈరోజు చేసిన టెస్ట్ లు అన్నిట్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏమి లేవని పేర్కొంది. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉందని రాత్రి రక్త పోటు స్టేటస్ ఆధారంగా రేపు ఉదయం డిస్చార్జ్ చేసే అంశాన్ని పరిశీలిస్తాంమని పేర్కొన్నారు.  అన్నాత్తే సినిమా కోసం రోజుకు 14 గంటల పాటు పని చేసిన రజినీకాంత్ కు అస్వస్థత ఏర్పడినట్టు చెబుతున్నారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన నేపథ్యంలో రజినీ అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రావద్దని చెబుతున్నా హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు. పేషేంట్లను, అటెండర్లను మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. కొత్త వాళ్ళను లోపలికి అనుమతించడం లేదు. రజనీకాంత్ కు హై బీపీ సమస్య తప్ప మరొకటి లేదంటున్నారు డాక్టర్లు. అయితే రజిని త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.

Related posts