మెగా హీరో వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ జంటగా.. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా సినిమా‘గని’. ఇందులో వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. టీజర్స్, ట్రైలర్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈరోజు ( ఏప్రిల్ 8) థియేటర్స్‌లో విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించాడు. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకున్నాయి.
వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఉండే యాక్షన్స్ సీన్స్, వరుణ్ సిక్స్ ప్యాక్ బాడీ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి , నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వరుణ్ తల్లి పాత్రలో అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కనిపించంది.
ఇక ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రివ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో ఏమన్నారో చూద్దాం..
బాక్సర్‌గా వరుణ్ తేజ్ వందశాతం మెప్పించాడని చెబుతున్నారు. ఎప్పుడూ గెలవాలనుకునే బాక్సర్ గని కథే ఇది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామానే అయినా.. వరుణ్ తేజ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని కొంతమంది ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.
ఫస్టాఫ్ ప్రేమకథతో నింపేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ స్టార్ట్ చేశాడు.. క్లైమాక్స్ అద్భుతమని, కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేషాలు కూడా బాగా పండాయని ట్వీట్ చేస్తున్నారు
ఇక వరుణ్ తేజ్ చాలా సన్నివేశాల్లో వన్ మ్యాన్ షోగా నటించాడు. తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
First half report :BGM is the only plus.. Pre interval is ok 👍 Apart from that chaala slow ga undi.. 🏃🤷♂️Ala ala velthadi.. 🙃@tollymasti #tollymasti
.
.#Ghani #GhaniReview #GhaniFromApril8th #GhaniReleasePunch #VarunTej #GhaniMovie— Tollymasti (@tollymasti) April 8, 2022
అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై తెరకెక్కిన గని చిత్రం ప్రొడక్షన్ వాల్యూ విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ అయినా సాయి మంజ్రేకర్ అద్భుతంగా నటించిందంటూ ప్రశంసిస్తున్నారు. మరో వైపు బాలీవుడ్ స్టార్ సునిల్ శెట్టి, కన్నడ స్టార్ ఉపేంద్ర యాక్టింగ్ పై కూడా ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు.
బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదంటే… నందమూరి చిన్నల్లుడి కామెంట్స్