telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సోలో బ్రతుకే సో బెటర్” థీమ్ సాంగ్

SBSB

ఇటీవల “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయితేజకు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ థీమ్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సింగల్ సోదరసోదరీమణులారా..’ అంటూ సాయి తేజ్ ట్వీట్ చేస్తూ థీమ్ సాంగ్ వీడియో లింక్ ను పోస్ట్ చేశారు. “కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. అలాగే, ‘ప్రేమ’ అనేది కూడా ఒక ఫీలింగేగా, మారదని గ్యారంటీ ఏంటి?.. ‘సోలో బ్రతుకే సో బెటర్ ?” అంటూ సాయితేజ్ అంటున్నారు. కాగా ఈ చిత్రం ఈ ఏడాది మే 1న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts