telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్

రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన అర్చన అనే ఎంబీఏ యువతిని అరెస్ట్ చేసారు రాచకొండ పోలీసులు. మాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి బాధితుల నుండి డబ్బు డిమాండ్ చేస్తున్న అర్చన… ఎన్నారైలను టార్గెట్ చేసి పలువురిని మోసం చేసిన కేసులో అరెస్ట్‌ చేశారు పోలీసులు. మాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్ లు క్రియేట్ చేసుకున్న అర్చన.. ప్రొఫైల్ పై ఆసక్తి చూపిన ఎన్నారై లకు కాల్ చేస్తూ మోసాలకు పాల్పడింది. ఫోన్ నంబర్ దొరకకుండా మొబైల్ సాఫ్ట్‌వేర్‌ నుండి కాల్ చేసిన అర్చన… షార్ట్ వీసా మీద ఇండియా వచ్చనంటు నమ్మబలికింది. తనను కలవాలంటే డబ్బు చెల్లించాలని బాధితులను డిమాండ్ చేసింది. పలువురిని ఇదే రీతిలో మోసం చేసింది యువతి. ఈ కిలాడీ లేడీ అర్చన రాచకొండ పోలీసుల అదుపులో ఉంది.

Related posts