telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్, క్రిష్ సినిమాకు మరో ఆసక్తికర టైటిల్ ?

Pawan

“వకీల్ సాబ్” చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయింది. ఇక ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించే చిత్రం టైటిల్ పట్ల కూడా అభిమానుల్లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం టైటిల్ని పవన్ జన్మదినమైన సెప్టెంబర్ 2న ప్రకటించడానికి దర్శకుడు క్రిష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ’విరూపాక్షి‘ అనే టైటిల్ ను పెట్టినట్టు నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ చిత్రం కోసం ‘బందిపోటు’, ‘గజదొంగ’ అనే పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు విన్పించాయి. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్యం పూర్వం నాటి కథతో పిరీయాడి డ్ మూవీగా నిర్మిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర టైటిల్ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాకు ‘వీర’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్రయూనిట్. కథ పరంగా ఈ సినిమా ‘వీర’ అయితే సరిగ్గా సరిపోతుందని క్రిష్ భావిస్తున్నాడట . పవన్ కూడా ఈ టైటిల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చిత్రంలో ఓ కథానాయికగా కనిపించే అవకాశం ఉంది.

Related posts