telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గత నాలుగేళ్లుగా .. పెరిగిన నిరుద్యోగం.. మరో ఆర్థికమాంద్యమా..

unemployement drastically raised for last 4 yrs

ఇప్పటికే దేశం అంతటా వ్యతిరేకత ఉన్న బీజేపీకి మరో దెబ్బ తగిలింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిందని నివేదికలు విడుదల అయ్యాయి. 2017- 18 ఏడాదిలో దేశంలో నిరుద్యోగ రేటు మునుపెన్నడూ లేనంతగా నాలుగున్నర దశాబ్దాల గరిష్టానికి చేరిందని జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) వెల్లడించింది. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశంలో ఉన్న ఉద్యోగులకే కోత పడుతుండగా.. ఏటేటా లక్షల్లో నిరుద్యోగులు వారికి జత అవుతున్నారు.

మోడీ సర్కారు తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో దేశంలోని లక్షలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, 2017 జూలై నుంచి 2018 జూన్‌ మధ్య దేశంలో నిరుద్యోగిత రేటు 6.1 శాతంగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఎస్‌వో, పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో ఈ విషయం వెల్లడైంది. 1972 -73 తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.

సర్వేలో వెల్లడించిన అంశాల ప్రకారం.. గతేడాది నిరుద్యోగ రేటు 6.1 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం 7.8 శాతం ఉండగా, గ్రామాల్లో 5.3 శాతంగా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. గత నాలుగున్నర దశాబ్దాలలో ఇదే అత్యధికం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువవడంతో యువత గ్రామాలలో ఉండలేక పట్టణాలకు వలస వెళ్తున్నారు. వీరిలో చాలామంది నిర్మాణరంగంలో పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది.

ఇక పట్టణ ప్రాంత నిరుద్యోగుల విషయానికొస్తే… గతేడాది 18.7 శాతం మంది పురుషులు, 27.2 శాతం మంది మహిళలు నిరుద్యోగంలో మగ్గుతున్నారని నివేదిక తేల్చింది.

Related posts