telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్ వేవ్ : ఎండాకాలంలో కూలర్లు, ఫ్యాన్లు వాడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి

ఎండాకాలం వచ్చేసింది. ఇంకేం అందరూ ఉక్కపోతతో  ఇబ్బంది పడుతుంటారు. దీంతో అందరూ ఏసీ, కూలర్లు, ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో అసలు కూలర్లు, ఏసీలు వాడచ్చా? అనే సందేహం అందరిలోనూ మెలుగుతున్న ప్రశ్న. అయితే ఈ కరోనా టైం లో కూలర్లు, ఏసీలు వాడేవారు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఏసీలు, కూలర్లు పని చేస్తున్నా.. బయటి నుంచి గాలి వచ్చేలా, ఇంట్లోనే గాలి బయటకు వెళ్లేలా కిటికీలను కొద్దిగా తెరచి పెట్టడం మంచిది.

స్ప్లిట్ ఎసి ఫిల్టర్లను.. కార్యాలయాల్లోని సెంట్రోలిజీడ్ ఏసీల డక్ట్ లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.

కమర్శియల్ ప్రాంతాల్లో.. 70-80 శాతం బయటి గాలిలోనికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎయిర్ కూలర్లు వాడుతున్నవారు.. అవి బయటి గాలిని పీల్చేలా జాగ్రత్త పడాలి. కూలర్ ను గది తలుపు లేదా కిటికీ దగ్గర పెట్టాలి.

కూలర్ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్ళీ నింపుకోవాలి

కూలర్లను వినియోగిస్తున్నా.. తేమ బయటకు వెళ్లేలా కిటికీలను తెరచి పెట్టాలి. బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లను వాడకూడదు.

ఫాన్స్ వినియోగించే వారు కిటికీలను కొద్దిగానైనా తెరచి ఉంచాలి. ఫాన్స్ వాడే గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్ చేసి పెట్టడం మంచిది.

Related posts