telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా మందులు అందుబాటులో ఉంచాలి: మంత్రి ఈటల

Etala Rajender

కరోనా మందులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో మందుల కొరతపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మందుల కొరతపై తన కార్యాలయంలో ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, డాక్సామెతాసోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలొన్‌ మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు. విటమిన్‌-డీ, సీ, మల్టీవిటమిన్‌, జింక్‌ వంటి ఔషధాలను మందుల దుకాణాలు, దవాఖానల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.

Related posts