కర్నూల్ జిల్లా నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సూరజ్ అనే కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం ఎలక్ట్రికల్ వర్క్ కోసం టెండర్ వేసాడు. అయితే దానిని రద్దు చేయకుండానే ఆ కాంట్రాక్టర్ ను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ఒంగోలు కు చెందిన మాధవరావు అనే వ్యక్తి కి కాంట్రాక్టు ఇప్పించినట్లు సూరజ్ ఆ వీడియో లో ఆరోణలు చేసాడు. దింతో తాము హై కోర్టు కు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న ఫలితం లేకపోయిందని.. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఆ కాంట్రాక్టును అధికారులు అప్పగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. ఎమ్మెల్యే తన తండ్రి తిట్టినట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ అందులో వాస్తవం లేదని తెలిపాడు. తిట్టినట్లు నిరూపించాలని సూరజ్ కుమారుడు డిమాండ్ చేసాడు. ఎమ్మెల్యే చేసిన పనివల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని..తమకు చావాలో, బతకాలో అర్థం కావడం లేదని వాపోయారు.
previous post