telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

18 ఏళ్ల కుర్రాడి దగ్గర కొకైన్… అసలు కారణం తెలిసి షాకైన కోర్టు

18-yrs-boy

ఆస్ట్రేలియాకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడు తన బర్త్‌డే పార్టీలో మాదకద్రవ్యాలతో దొరికిపోయాడు. పబ్బులో 18వ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న జాక్ రోజర్స్ అనే కుర్రాడు.. తనిఖీకి వచ్చిన పోలీసులను చూసిన జేబులోని కొకైన్‌ను పారేయబోయాడు. అది గమనించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర కొద్ది మొత్తంలో ఉన్ కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా.. మాదకద్రవ్యాలను ఎందుకు కొనుగోలు చేశావని జాక్‌ను న్యాయమూర్తి ప్రశ్నించాడు. దానికి జాక్, ‘అది నా పుట్టినరోజు. ఎంజాయ్ చేద్దామని కొనుక్కున్నా’ అని బదులిచ్చాడు. అతని సమాధానం విన్న జడ్జి ఆశ్చర్యపోయాడు. ఎవరి పుట్టినరోజైనా చట్టానికి సెలవుండదని, మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిన కోర్టు.. పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని హెచ్చరించింది. అతని వద్ద లభించిన కొకైన్ చాలా కొద్ది మొత్తంలో ఉండటంతోనే జాక్‌కు జైలుశిక్ష విధించలేదని అధికారులు చెప్పారు.

Related posts