telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీడియో వైరల్ : తల్లి గర్భంలోనే బిడ్డ డ్యాన్స్…!

Baby
పుట్టకముందే గర్భంలో ఓ బిడ్డ డిస్కోడాన్స్ చేస్తూ ఉన్న అల్ట్రాసౌండ్ స్కాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మంగళవారం ఓ బ్లాగర్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయగా, అతి తక్కువ సమయంలోనే ఈ వీడియోకు దాదాపు 40 లక్షల వ్యూస్ రావడం విశేషం. అంతేకాకుండా కొన్ని వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో బిడ్డ రెండు కాళ్లను ఆడిస్తూ అటూఇటూ కదులుతూ డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఈ వీడియో ఎవరికి చెందినది, వీడియోలో కనిపిస్తున్నది పాప లేదా బాబా అనే విషయం తెలీదు. ఇటీవలే చైనాలో ఇద్దరు కవలలు తల్లి కడుపులో కొట్టుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏప్రిల్ 8న పుట్టిన ఆ కవలలకు తల్లిదండ్రులు చెర్రీ, స్ట్రాబెర్రీ అనే పేర్లు కూడా పెట్టారు. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.  

Related posts