telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కొబ్బరినీళ్లు.. ఆరోగ్యానికి మరియు అందానికి కూడా..

coconut water for health and beauty

కొబ్బరి నీళ్లు, స్వచ్ఛమైన ఈ నీరు తాగటంతో దాహార్తి క్షణాలలో తీరిపోతుంది. ఈ నీరు దాహం కోసం మాత్రమే కాదు, అందులో ఉండే పోషకాలతో శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. టీ, కాఫీలు తాగాలి అనిపించినప్పుడు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగినా ఒక్కసారిగా రిఫ్రెష్ అయిపొతాము; దానితోపాటుగా ఆరోగ్యం కూడా. ఎప్పుడో ఎండా కాలంలోనో, వేడి చేసినప్పుడో కాకుండా వీలైతే రోజూ ఈ నీరు తీసుకుంటే, తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు వైద్యులు. ఏమంటే, ఈ కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అంటున్నారు వైద్యులు.

  • డీహైడ్రేషన్ సమయంలో కొబ్బరి నీరు తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఈ నీళ్లను తీసుకోవడం వలన శరీరంలోని వేడి తగ్గిస్తుంది.
  • కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించి.. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. తరచు కొబ్బరి నీరు తాగడం వలన అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
  • ఆయుర్వేదం ప్రకారం… కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఈ నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఈ నీళ్లను చర్మంపై రాసుకుంటే శరీరంపై గల పొక్కులు, ర్యాషెస్ తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లకు అంతటి ప్రాధాన్యత ఉన్నది.
  • కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపవుతుంది. ఉదయాన్నే గ్లాస్ కొబ్బరి నీరు తాగి చూడండి.. మీకే తేడా కనిపిస్తుంది. ఈ నీటిని చర్మానికి కూడా రాసుకోవచ్చును. కొబ్బరి నీరు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి.

Related posts