telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు

నోరు జారీ .. నాలుక కరుచుకున్న .. గుత్తా జ్వాల…

gutha jwala on bigg boss 3 selections

గుత్తా జ్వాల బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్ ను తప్పు పట్టారు. సైనాపై జ్వాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సైనాకు మద్దతుగా జ్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాడ్మింట్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బీజేపీలో చేరడంపై సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాల తప్పు పట్టారు. ఇప్పటివరకు అర్థంపర్థం లేని ఆటనే ఆడావనుకున్నా… కానీ అర్థంపర్థం లేని పార్టీలో కూడా చేరావా?అంటూ సైనాపై గుత్తా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు సైనా స్పందించలేదు. నెటిజన్లు మాత్రం గుత్తా జ్వాలాకు చీవాట్లు పెడుతున్నారు. సైనా అర్థం పర్థం లేని రిలేషన్‌ షిప్‌లు, పెళ్లిళ్లు చేసుకోలేదని ఓ నెటిజన్‌ ఘాటుగా విమర్శించాడు. ‘సైనాను, బీజేపీని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో ముందు చూసుకో, నీ సహచర క్రీడాకారిణపై అంత అక్కసు ఎందుకు? నువ్వు కూడా నీకు నచ్చిన పార్టీలో చేరొచ్చు కదా?’అంటూ నెటిజన్లు గుత్తా జ్వాలకు సూచిస్తున్నారు.

ప్రస్తుతం సైనా నెహ్వాల్‌కు సంబంధించి గుత్తా జ్వాలా చేసిన ట్వీట్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్షు సైతం …జేపీ నడ్డా సమక్షంలో బీజీపీలో చేరారు. దేశం కోసం మంచి చేసే బీజేపీలో చేరానని, దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉందంటూ బీజేపీలో చేరిన సందర్భంగా సైనా చెప్పుకొచ్చింది. మొత్తానికి సైనా నెహ్వాల్ బీజేపీలో చేరటంపై గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎపిసోడ్ లో జ్వాలా కంటే కూడా సైనాకే ఎక్కువ మంది నెటిజన్లు సపోర్టు చేస్తున్నారు.

Related posts