telugu navyamedia
సినిమా వార్తలు

“అర్జున్ రెడ్డి” ఒక చెత్త సినిమా… మళ్ళీ దానికి రీమేక్… : “కబీర్ సింగ్”పై నటి ఫైర్

Kabir-Singh

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదాను తెచ్చిపెట్టిన “అర్జున్ రెడ్డి” చిత్రం “కబీర్ సింగ్” పేరుతో ఇటీవలే బాలీవుడ్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కానీ ఈ చిత్రానికి బాలీవుడ్ విమర్శకుల నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.87 కోట్లు వసూలు చేసింది. తాజాగా “అర్జున్ రెడ్డి” ఓ చెత్త సినిమా అని దానికి ఇప్పుడు రీమేక్ వచ్చిందని, ఇదొక హింసాత్మకమైన సినిమా అని, ఆదర్శంగా ఉండాల్సిన పెద్ద స్టార్లు ఇలాంటి స్క్రిప్ట్ లను ఎన్నుకోవడం కరెక్ట్ కాదని.. సంప్రదాయాల్ని పక్కన పెట్టి చిత్ర పరిశ్రమ ప్రయాణం ఇలా సాగితే నటీమణుల పాత్రలు కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితమవుతాయని సీబీఎఫ్‌సీ సభ్యురాలు, టీవీ నటి వాణి త్రిపాఠి ‘కబీర్ సింగ్’ సినిమాపై మండిపడ్డారు. మహిళలపై చెడు ప్రభావం చూపే కథను రాయడం ఆపాలని అన్నారు. ఇక్కడ తప్పు.. ఒప్పు అనేది విషయం కాదని.. ఓ నటుడు వెండితెరపై ఎలాంటి పాత్రను ఎన్నుకుంటున్నారనేది.. అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని, అతడు నటించకపోతే ఆ పాత్ర కేవలం పేపర్ కి మాత్రమే పరిమితమవుతుందని అన్నారు.

Related posts