telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వరల్డ్ ఫేమస్ లవర్” ట్విట్టర్ టాక్

WFL

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తన స్టైల్లో విజయ్ దేవరకొండ నిర్వహించిన ప్రమోషన్స్ సినిమాపై విపరీతమైన బజ్, హైప్‌ను క్రియేట్ చేశాయి. వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్న వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ఫస్టాఫ్‌పై మిక్స్‌డ్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఫస్టాఫ్ అదిరిపోయిందని కొంతమంది అంటుంటే.. పర్వాలేదు అని మరికొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ తన నటనతో కట్టిపడేశారట. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా చేశారని కొనియాడుతున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఫస్టాఫ్ పర్ఫెక్ట్ బేస్‌ను ఏర్పరిచారట. అయితే, కథలో కథ అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది. మొత్తం మీద సినిమా అయితే బాగుంది కానీ మరీ ఎంజాయ్ చేసేంతగా లేదంటుని ట్వీట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్‌పైనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గౌతమ్, యామిని సీన్స్ ఫస్టాఫ్‌కు బలం అంటున్నారు. సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ చాలా బాగుందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు. అయితే, సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ గుండెల్ని పిండేస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సీనయ్యగా విజయ్ దేవరకొండ, సువర్ణగా ఐశ్వర్య రాజేష్ నటన సినిమాకే హైలైట్ అంటున్నారు.

Related posts